స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Tuesday 24 May 2011

అన్వేషణ

మనసుని చేరే ప్రతి ఒక్క బంధం, భాదనే మిగిల్చేది అయితే,
కడలిని సైతం మున్చేయ్య గలిగిన, కన్నీళ్ళే మనిషికి మిగులుతాయి
ఏ బంధం స్థిరమై, శాశ్వతమై మనల్ని కోరుకుంటుందో,
ఆ బంధాన్ని కోరుతూ కన్నులు ఎదురుచూస్తూ వుండి పోతాయి

ఆ బంధం వుంటుందా ఈ ప్రపంచంలో అన్నదే నా అన్వేషణ
హృదయం కరిగి ప్రేమ వికసించే సమయం కోసం ఎదురుచూస్తూ

No comments:

Post a Comment