స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Saturday 1 December 2012

రాయలేను కవిత నేను

రాయలేను కవిత నేను
దుశ్సాసన గురువులున్న ఈ సమాజంలో బ్రతుకుని భరిస్తూ
ద్రౌపతిగా మారిన నా తెలుగు తల్లిని పూజిస్తూ .......

రాయలేను కవిత నేను
వ్యాపారమైన నేటి రాజకీయాలని భరించలేక
చితిని రగిలే రైతుల ఆత్మఘోషలని వింటూ ..........

రాయలేను కవిత నేను
వికృతమైన మనిషి చేష్టలకు ఆహుతై
ఆకృతోడిన ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ......

రాయలేను కవిత నేను
నైతిక విలువలను ఏమార్చి న్యాయ, ధర్మ దేవతలను
వికలాంగులుగా మార్చిన ఈ సమాజాన్ని కీర్తిస్తూ .......

రాయలేను కవిత నేను
జననం, జీవనం, మరణాలే
జీవితం అని చెప్పే వేదాలను వర్ణిస్తూ ......

రాయలేను కవిత నేను
అక్షరం విలువ తెలియని
ఆటవికులు నిండిన ప్రపంచంలో జీవిస్తూ ...............

రాయలేను కవిత నేను, తలరాత మార్చలేని దానను.