స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Wednesday 3 October 2018

మార్గదర్శి

ఎవరైనా మనల్ని ఏమి సాదిన్చావు అని అడిగితే, కనీసం ప్రయత్నించాను అని కూడా చెప్పలేక పోయినప్పుడు ఆ జీవితానికి విలువ ఉండదు. ఎందుకంటే, ప్రయత్నించిన ప్రతి వ్యక్తీ తానుగా విజేత కాకపోవచ్చు, కానీ, ఒక విజేతకి మాత్రం తప్పకుండా మార్గదర్శి అయివుంటాడు.

ప్రయత్నం

ఆలోచిస్తూ మాత్రమే ఉండిపోతే, ఏ పనికీ అంకురార్పణ జరగదు. ఆచరించటం మొదలు పెట్టినప్పుడే ఫలితాన్ని పొందటం సాధ్యం అవుతుంది. అందుకనే, ఆలోచన మాత్రమే చేసే వ్యక్తితో 60 సంవత్సరాలు ఉండే కన్నా, ఆలోచనలని ఆచరణలో పెట్టే వ్యక్తితో 60 నిముషాలు వుండటం మిన్న (ఎందుకంటే, ప్రయత్నంతోనే సమాదానాలు సాధ్యపడతాయి).

జీవితం

చెక్కే కొద్ది నొప్పి పుడుతుంది కదా అని శిల్పి శిల్పాలని చెక్కడం ఆపేస్తే, అందాలకి ఆయుష్షు తగ్గిపోతుంది. అలానే, కాలం పెట్టే పరీక్షలకి తట్టుకోలేకపోతున్నారు కదా అని, దేవుడు మనిషికి ఆలోచనా జ్ఞానాన్ని తగ్గిస్తే, జీవితం కి  విలువ లేకుండా పోతుంది.

భార్యా భర్తలు

నీ జీవిత కాలం నూరేళ్ళు అయితే, నా జీవితం దాని కన్నా ఒక్క క్షణం ఐనా తక్కువ గా ఉండాలి అని కోరుకునే వాళ్ళే భార్యా భర్తలు. ఎందుకంటే, నిజమైన ప్రేమ లో ఒకరిని విడిచి ఇంకొకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఒకరి మరణాన్ని ఇంకొకరు చూడలేరు.

సాధన


నింగిని తాకలేని అలలను చూసి, ఆకాశం నవ్వుకుంటుందా
        వర్షపు జల్లు లాగ కడలిని చేరుకోక 

పుడమిని జీవించలేనని జాబిలి  బాధతో, మబ్బు చాటున దాగిపోతుందా 
        వెన్నెల వసంతాలు పంచకుండా

ఊపిరి ఆపుతున్న, ఆవేదనల నడుమ మనిషి అడుగు ఆగుతుందా
       చిన్న స్నేహపు చేయుతనివ్వకుండా 

సాధన ఒక్కటే సాధ్యం చేయదా 
      ఒంటరి  అడుగులను మార్గంగా చేయగా

Wednesday 25 February 2015

మానవ సంబంధం

బాధ అని తెలిసినా, తల్లి బిడ్డకి జన్మనిస్తుంది.
భారం అని తెలిసినా, పుడమి ఆ బంధాన్ని మోస్తుంది.
కాబట్టి, ఒకరి కోసం ఒకరు నిలబడటానికి ఏ అనుబంధం అవసరం లేదు.
ఆత్మీయతల్ని ముడివేసే మానవ సంబంధం అయితే చాలు. 

Saturday 22 November 2014

మార్పుకు అందనిదే నా జీవితం

గతంతో కరిగిపోయింది నా చిరునవ్వే అయితే, మరచిపోయే దానిని.
కానీ, గతంతో కరిగిపోయింది నా జీవితమే అయితే, ఎలా మరచిపోగలను.

కొత్త అక్షరాలు పదముగా కూర్చి వ్రాయటానికి చిరిగి పోయినది కాగితం అయితే మళ్లీ ప్రయత్నించ వచ్చు.
కానీ, విరిగిపోయింది మనసు అయితే, ఎలా ప్రయత్నం చేసేది.

తగిలిన గాయాలు శరీరాన్ని మాత్రమే భాదిస్తే కల అనుకుని వదిలేసే దానిని.
కానీ, హృదయపు అదం పై తగిలిన గాయాలు ముక్కలుగా మారి జ్ఞాపకాలలో చేరి పదే పదే భాదిస్తుంటే, ఎలా వదిలివేయగలను .

పోనీలే అని అనుకోవటానికి, ఇది కధ కాదు. కల్పన కాదు. ప్రయాణం కాదు.
ఒక్క సారిగా ప్రాణాలని తీసుకునే ప్రమాదం కూడా కాదు.
ప్రాణం వున్న మనిషే అనిపిస్తున్నా, ఎలాంటి భావనలు పైకి తెలపలేని నా మనసు పడే మూగయాతన.