స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Sunday 29 May 2011

Balli Saastram

For Women

Head - There is a danger to your life
Left eye - Your husband loves you
Right eye - You are mentally tense
Breast - You will be happy
Right Cheek - You are blessed with a male baby
Right ear - You will earn a lucky prize
Upper lip - Enemity with someone
Lower lip - You will buy new items
Both lips - You are going to face difficulties
Back - Be ready for death news from your friends or relatives
Nails - Someone will fight with you
Palms - You lose money
Right Hand - You will gain money
Left Hand - You are mentally disturbed
Fingers - You will earn jewellery
Knees - You will win friends
Right Leg - Destroy your enemies
Toes - You are blessed with a male baby



For Men

Head - Someone will fight with you
Left eye - You have a good news
Right eye - You will be defeated
Right Cheek - You have a bad news
Left ear - You will win a lucky prize
Upper lip - Enemity with someone
Lower lip - You will win prize money
Both lips - Be ready for death news from your friends or relatives
Palms - You will lose money
Fingers - Your friends will visit you
Right shoulder - Difficult time ahead
Left shoulder - You may face an insult
Moustache - Difficult time ahead
Foot - Difficult time ahead
Behind foot - Trevel time

అనుభవాతీతం

చిన్తపిక్కల్లాంటి కళ్ళు
చాక్పీసు లాంటి ముక్కు
కుళ్ళిపోయిన టొమాటో లాంటి పెదవులు
దిష్టి గుమ్మడికాయ లాంటి మొహం
వర్ణనాతీతం నీ రూపం
బాబోయ్ అంత సౌందర్యం అనుభవాతీతం

Thursday 26 May 2011

ఉషోదయం

ఉషోదయ రవికిరనంలా
రేయి పున్నమి వెన్నెలలా
నిన్నటి రేయికి కలలా
రేపటి తీపికి గుర్తులా
కొంగొత సొగసులతో ఉండిపోవాలని ఆశగా వచ్చింది
ఆ ఆశలకి స్వాగతం చెప్తూ..

అభిలాష

కళలు నిండిన ప్రపంచంలో, కన్నులు చూసే దూరం లో, కలతయి, కలవరమయి, కల్లోలమయి, నా మనసుని ముక్కలు చేస్తున్న ఓ నా ఆప్త మిత్రులారా! ఆలోచనలు అనే సముద్రం లో ఆటంకాలు అనే అలలను ఎదిరించి పోరాడలేక, అనుమానం అనే నీటి బిందువే సుడిగుండంలా మారి, నన్ను ముంచడానికి ప్రయత్నిస్తూ ఉంటె,

నిన్ను ఒడ్డుకు చేర్చే మార్గంగా నేను ఉన్నాను అన్న చిన్న పిలుపు కోసం, ఆశగా, ఆవేదనగా ఎదురుచూస్తూ, నా కన్నీళ్ళని సయితం, ఎదురీతకు ఆయుధంగా మార్చుకుంటున్నాను.

గెలుస్తాను అన్న నమ్మకమో లేక గెలవగలను అన్న ఆత్మ స్థయిర్యమో తెలియదు కాని,

నా బ్రతుకుని ఆయుధంగా మార్చుకుని, నలుగురిని బ్రతికించాలి అన్న ఆకాంక్షని ఆశయంగా తీసుకున్న, నా చిన్ని అభిలాషని ఆశీర్వదించండి.

Project Management Process

Successful project Management

PHP Coding Standards

నీ ప్రమాణం

పుష్పించను అన్న  విరికి  తుమ్మెదనౌతాను అన్నావు
నేల  రాలనన్న  చినుకుకి  హరివిల్లునౌతాను అన్నావు
నింగి  వీడని  చీకటికి  వెన్నెలనౌతాను అన్నావు
నిదుర  ఎరుగని  కలకి  వాస్తవమౌతాను అన్నావు
నీడగా  మరుజన్మకు  కూడా  తోడౌ తాను అన్నావు.

Wednesday 25 May 2011

స్నేహం ప్రయాణం

అలల  ప్రయాణం  తీరం  వరకు
కళల  ప్రయాణం  మెలుకువ  వరకు
గాలి  ప్రయాణం  సూనయం వరకు
కాలం  ప్రయాణం  ప్రళయం  వరకు
మన  స్నేహం  ప్రయాణం  సృష్టి  ఉన్నంత  వరకు

నా చివరి రోజు

నిన్ను చూడకుండా  నా  కనులు
నీతో  మాట్లాడకుండా  నా  పెదవులు
నీతో  అడుగు  కలపకుండా నా  పాదములు 
నిన్ను  దగ్గరకి  తీసుకోకుండా  నా  తనువు
నీ  చేతి  స్పర్స  చేరలేని  ఆ  రోజు  
నా జీవితంలో చివరి రోజు

నీ తోడు కావాలి

నీ  ఎదుట  నిలిచే రోజు
నీతో  సాగే పయనం
నీతో  మాట్లాడే  క్షణం
నీ  ఆప్యాయతలో కలిగే పరవశం
నీ  ప్రేమతో  నాలో  కలిగే స్పందన
నా జీవితానికే తోడుగా మిగిలిపోయే రోజు కావలి

Tuesday 24 May 2011

శుభోదయం

నిన్నటి  ఆలోచనల  మధ్య  అలసిన  నీ  కనుపాప
ఆదమరచిన  తనువుతో  నిదురించిన  సేయ్యని  వదిలి  పెట్టి
లేలే  మంటూ  ఒక  ఉదయం  ఉషోదయమై  నీ  ముంగిట  నిలచింది
అన్నీ  అస్తమయం  తెలియని  ఉదయాలే
ఆ  ఉదయానికి  స్వాగతం  చెప్తూ...

నిరీక్షణ

ఆకలివేలలో అమ్మనై
బాధలో స్నేహితురాలినై
సలహాలలో మంత్రినై
బాధ్యతలలో తండ్రినై
అనురాగంలో చెలినై
నీతో తోడుగా నీడనై
నీ జీవితంలోకి  రావాలని కోరుకుంటూ..
నీ నిరీక్షణ



నీతో నా అనుబందం

నీ రాకలో వున్న ఆనందం, నా కన్నుల్లో వెలుగై కనిపిస్తుంది.
నీ పలుకులో వున్న తియ్యదనం, నా మోముపై చిరునవ్వై తెలియచేస్తుంది.
నీ స్పర్సలో వున్న కమ్మదనం, నా హృదయ స్పందనై ప్రేమని పంచుతుంది
నీ ఎడబాటు లో వున్న విరహం, నా బ్రతుకుని అంతా చీకటిగా మార్చేస్తుంది.

ఆలాపన

ఆలోచించని అనుబంధాలు
ఆవేదననిస్తున్న అనుభవాలు
మౌనమే బాషగా మారుతున్న భావాలు
మది దాటలేకపోతున్న ఆలోచనలు
ఇవే ఈ ఆశకు ఆలాపనలు

అన్వేషణ

మనసుని చేరే ప్రతి ఒక్క బంధం, భాదనే మిగిల్చేది అయితే,
కడలిని సైతం మున్చేయ్య గలిగిన, కన్నీళ్ళే మనిషికి మిగులుతాయి
ఏ బంధం స్థిరమై, శాశ్వతమై మనల్ని కోరుకుంటుందో,
ఆ బంధాన్ని కోరుతూ కన్నులు ఎదురుచూస్తూ వుండి పోతాయి

ఆ బంధం వుంటుందా ఈ ప్రపంచంలో అన్నదే నా అన్వేషణ
హృదయం కరిగి ప్రేమ వికసించే సమయం కోసం ఎదురుచూస్తూ

నీవే నా జీవితం

నీవు వున్నప్పుడు నీతో జంటగా
నీవు లేనప్పుడు ఏకాంతం లో ఒంటరిగా

ఒకప్పుడు నీ కళ్ళలో నన్ను నేను చూసా
ఇప్పుడు నా కళ్ళలో నీ రూపాన్ని చూస్తున్నా

నేను మౌనం గా ఉంటున్నా
నా హృదయం మాత్రం నీ పేరునే స్మరిస్తుంది.

నీతో గడిపిన క్షణాలు మధురమైనవే ఏనాడూ
నేను ఎన్ని ఆలోచిస్తున్న , చివరి ఆలోచన మాత్రం నీతోనే ఎప్పుడూ

నాలో నువ్వు

నా  కనుల  ఎదుట  నీవు  లేవు
నా  కనుల  నిండా  నీవై  వున్నావు

నా  మాటల్లో  నీవు  లేవు
నా  ప్రతి  పలుకులో  నువ్వే  తలపువై  వున్నావు

నా  బాషలో  నీవు  లేవు
నా  మనసు  భావాల  నిండా  నువ్వే  వున్నావు
నా  కళ్ళలో   నీవు  లేవు
నా  హృదయ  సింహాసనం  పై  రారాజువై  వున్నావు

నా  శ్వాసలో  నువ్వు  లేవు
నా  బ్రతుకంతా  నీవై  ముడిపడి  వున్నావు

నీతో నా ప్రయాణం

మేఘం ప్రయాణం  చినుకై  కురిసే  దాక
మెరుపు  ప్రయాణం  వెలుతురు  మెరిసే  దాక
కనుల  ప్రయాణం  అందం  ఉన్నంత  దాక
మనిషి  ప్రయాణం  గమ్యం  చేరే  దాక
మనసు  ప్రయాణం  మమతలు  కలిసే  దాక
నీతో  నా  ప్రయాణం  నేను  చితిలో  కలిసే  దాక