స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Saturday 22 November 2014

మార్పుకు అందనిదే నా జీవితం

గతంతో కరిగిపోయింది నా చిరునవ్వే అయితే, మరచిపోయే దానిని.
కానీ, గతంతో కరిగిపోయింది నా జీవితమే అయితే, ఎలా మరచిపోగలను.

కొత్త అక్షరాలు పదముగా కూర్చి వ్రాయటానికి చిరిగి పోయినది కాగితం అయితే మళ్లీ ప్రయత్నించ వచ్చు.
కానీ, విరిగిపోయింది మనసు అయితే, ఎలా ప్రయత్నం చేసేది.

తగిలిన గాయాలు శరీరాన్ని మాత్రమే భాదిస్తే కల అనుకుని వదిలేసే దానిని.
కానీ, హృదయపు అదం పై తగిలిన గాయాలు ముక్కలుగా మారి జ్ఞాపకాలలో చేరి పదే పదే భాదిస్తుంటే, ఎలా వదిలివేయగలను .

పోనీలే అని అనుకోవటానికి, ఇది కధ కాదు. కల్పన కాదు. ప్రయాణం కాదు.
ఒక్క సారిగా ప్రాణాలని తీసుకునే ప్రమాదం కూడా కాదు.
ప్రాణం వున్న మనిషే అనిపిస్తున్నా, ఎలాంటి భావనలు పైకి తెలపలేని నా మనసు పడే మూగయాతన. 

Monday 10 November 2014

మన కలయిక

నిన్ను కలిసే వరకూ తెలియదు, నేను చూసే ప్రపంచం నీతో కలిసి చూసినప్పుడే అందం అని
నీతో మాట్లాడే వరకూ తెలియదు, నేను మాట్లాడే మాటల్లో నీ పై ప్రేమ వ్యక్తం చేసినప్పుడే ఆనందం అని
నీతో నడిచే వరకూ తెలియదు, నేను నేర్చుకున్న అడుగులు నీతో ఎదడుగులై కలసి నడవటం కోసమే అని
నీకు దగ్గరయ్యే వరకూ తెలియదు, నన్ను ఎప్పటికీ  కంటి పాపలా కాచుకునే ఒక బంధం ఉంటుంది అని
నీ ప్రేమ పొందే వరకూ తెలియదు, నా ఆనందమే తన ప్రపంచం అనేన్తలా పరితపించే ఒక హృదయం వుంటుంది అని
నీకు సొంతం అయ్యే వరకూ తెలియదు, నా శ్వాస నీ ప్రాణమై కలిసిపోయే క్షణమే మన జీవితపు మొదటి క్షణం అవుతుంది అని

ఎన్ని తెలుసుకున్నా ఒకటి మాత్రం ఇంకా తెలియదు, నువ్వు లేని ఒక క్షణం వుంటే, ఆ రోజు నేను ఉండగలనో  లేనో అని
ఎందుకంటే, నువ్వే నా ప్రపంచం, నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం.
అందుకే, ఈ పంచ భూతాలు ఉన్నంత వరకూ, నా పంచ ప్రాణాలు నీలోనే వుంటాయి అని ప్రమాణం చేస్తున్నా .