స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Thursday 26 May 2011

నీ ప్రమాణం

పుష్పించను అన్న  విరికి  తుమ్మెదనౌతాను అన్నావు
నేల  రాలనన్న  చినుకుకి  హరివిల్లునౌతాను అన్నావు
నింగి  వీడని  చీకటికి  వెన్నెలనౌతాను అన్నావు
నిదుర  ఎరుగని  కలకి  వాస్తవమౌతాను అన్నావు
నీడగా  మరుజన్మకు  కూడా  తోడౌ తాను అన్నావు.

No comments:

Post a Comment