స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Tuesday 24 May 2011

నాలో నువ్వు

నా  కనుల  ఎదుట  నీవు  లేవు
నా  కనుల  నిండా  నీవై  వున్నావు

నా  మాటల్లో  నీవు  లేవు
నా  ప్రతి  పలుకులో  నువ్వే  తలపువై  వున్నావు

నా  బాషలో  నీవు  లేవు
నా  మనసు  భావాల  నిండా  నువ్వే  వున్నావు
నా  కళ్ళలో   నీవు  లేవు
నా  హృదయ  సింహాసనం  పై  రారాజువై  వున్నావు

నా  శ్వాసలో  నువ్వు  లేవు
నా  బ్రతుకంతా  నీవై  ముడిపడి  వున్నావు

No comments:

Post a Comment