స్వరాభిషేకం



అక్షరం స్వరమై చెవులని తాకేవేల,
కలిగే ప్రతి అనువు స్పందన ఒక స్వరాభిషేకం
కలం జాలువార్చే అక్షరాల మాలిక ఒక పాట
ఆ పాటకి ఊపిరి పోసిన మనిషికి చేసే అబిషేకం మా ఈ స్వరాభిషేకం

Thursday 26 May 2011

అభిలాష

కళలు నిండిన ప్రపంచంలో, కన్నులు చూసే దూరం లో, కలతయి, కలవరమయి, కల్లోలమయి, నా మనసుని ముక్కలు చేస్తున్న ఓ నా ఆప్త మిత్రులారా! ఆలోచనలు అనే సముద్రం లో ఆటంకాలు అనే అలలను ఎదిరించి పోరాడలేక, అనుమానం అనే నీటి బిందువే సుడిగుండంలా మారి, నన్ను ముంచడానికి ప్రయత్నిస్తూ ఉంటె,

నిన్ను ఒడ్డుకు చేర్చే మార్గంగా నేను ఉన్నాను అన్న చిన్న పిలుపు కోసం, ఆశగా, ఆవేదనగా ఎదురుచూస్తూ, నా కన్నీళ్ళని సయితం, ఎదురీతకు ఆయుధంగా మార్చుకుంటున్నాను.

గెలుస్తాను అన్న నమ్మకమో లేక గెలవగలను అన్న ఆత్మ స్థయిర్యమో తెలియదు కాని,

నా బ్రతుకుని ఆయుధంగా మార్చుకుని, నలుగురిని బ్రతికించాలి అన్న ఆకాంక్షని ఆశయంగా తీసుకున్న, నా చిన్ని అభిలాషని ఆశీర్వదించండి.

No comments:

Post a Comment